Indian-American girl wins US young scientist prize భారత సంతతి బాలికకు యువశాస్త్రవేత్త అవార్డు

Seventh grader gitanjali rao is america s top young scientist

gitanjali rao, young scientist challenge, young scientist challenge winner, discover education winner, tethys, water lead contamination detector, world news

Indian-American Gitanjali Rao, 11, was announced the winner of Discovery Education’s 3M Young Scientist Challenge 2017 for her prototype water lead contamination detector, called ‘Tethys’.

భారత సంతతి బాలికకు యువశాస్త్రవేత్త అవార్డు

Posted: 10/21/2017 10:30 AM IST
Seventh grader gitanjali rao is america s top young scientist

భారత సంతతికి చెందిన బాలిక అరుదైన గౌరవాన్ని అందుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్త అవార్డును పదకొండేళ్ల గీతాంజలిరావు అందుకుంది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి.. నీటిలో సీసం కాలుష్య గుర్తించే పరికరంతో పాటు సదరు వివరాలను మొబైల్ ఫోన్ కు కూడా పంపించే విదంగా చేసిన అవిష్కరణకు గాను అమెకు ఈ అవార్డు వరించింది. నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్‌ త్రీఎం యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌’లో ప్రథమ స్థానం దక్కింది.

రెండేళ్ల కింద మిషిగన్‌ ప్రాంతంలోని ఫ్లింట్‌ దగ్గర నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం విషయం వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు.

రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలోనే గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్‌ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles